Home  »  TV News  »  Guppedantha Manasu : ఆ కాలేజీని వసుధార కాపాడుకోగలదా.. శైలేంద్ర డీలింగ్ కి అతను ఒప్పుకుంటాడా!

Updated : Jul 26, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1136 లో... దేవయానికి శైలేంద్ర ఫోన్ చేసి.. రంగా వేరు, రిషి వేరు.. వాడు రిషి కాదు రంగానే అని చెప్తాడు. అయితే వాడితో మనకి పని ఉంది వాడిని తీసుకొని వచ్చి మినిస్టర్ చెప్పినట్టు చెప్పిపిస్తే చాలు.. ఇక ఎండీ నువ్వే.. నువ్వు ఏం చేస్తావో తెలియదు.. ఆ రంగా మనతో కాలేజీకి రావాలని దేవయాని చెప్తుంది. మనపై డౌట్ రాకుండా మాట్లాడమని దేవయాని చెప్తుంది. సరే వాడిని ఒప్పించి తీసుకొని వస్తానని శైలేంద్ర అంటాడు.

మరొకవైపు మీరు చేస్తుంది తప్పు మేడమ్.. కాలేజీకి ఎండీ అంటున్నారు.. మీరు లేకపోతే కాలేజీ పరిస్థితి ఏంటని ఆలోచించడం లేదు. కనీసం మీ మావయ్య గురించి ఆలోచించడం లేదు.. ఎప్పుడు రిషి సర్ అంటూ నా వెంట తిరుగుతున్నారని రంగా కోప్పడతాడు. దాంతో మీరు రిషి సర్ నే అందుకే ఇలా ఆలోచిస్తున్నారని వసుధార అంటుంది. ఆ తర్వాత బుజ్జి ఫోన్ తీసుకొని.. వసుధార కాలేజీకి ఫోన్ చేస్తుంది. మీ ఎండీ గారికి ఫోన్ ఇవ్వండి అనగానే.. మా కాలేజీకి ప్రస్తుతం ఎండీ ఎవరు లేరు.. రేపు కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని అతను చెప్తాడు. దాంతో వసుధార షాక్ అవుతుంది. ఆ విషయం రంగాకి చెప్తుంది. చూసారా మీ వల్ల మీ రిషి సర్ కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్లిపోతుందని రంగా అంటాడు. సర్ మీరు నాతో రండీ కాలేజీని కాపాడుకుందామని వసుధార అనగానే.. నేను రానంటూ రిషి కోపంగా వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రంగా దగ్గరికి సంజీవయ్య వచ్చి.. నీతో పెళ్లి కొడుకు అన్నయ్య ఏదో మాట్లాడాలంట అని చెప్తాడు. సరే అని రంగా అంటాడు. మేడమ్ మీరు ఇంట్లోనే ఉండండి అని వసుధారకి రంగా చెప్తాడు. ఆ తర్వాత అసలు మొన్న వినిపించిన వాయిస్ శైలేంద్ర దేనా అని వసుధార అనుకుంటుంది. రిషి సర్ తను ఇంకా భయటపడడం లేదని వసుధార అనుకుంటుంది. మరొక వైపు సంజీవయ్య రంగాని తీసుకొని వస్తాడు. కాసేపటికి సంజీవయ్యని వెళ్ళమని చెప్తాడు శైలేంద్ర. ఆ తర్వాత నిన్నే డౌట్స్ క్లారిటీ చేసాను కదా.. మళ్ళీ ఏం మాట్లాడాలని రంగా అంటాడు. నీపై నాకు ఏ డౌట్ లేదంటూ రంగాకి రిషి ఫోటోని చూపించి.. ఇతను నా తమ్ముడు రిషేంద్ర భూషణ్.. కాలేజీ ఎండీ అంటూ రిషి గురించి గొప్పగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.